శాశ్వతము కాదు ఈ లోకము

Telugu Christian Song

శాశ్వతము కాదు ఈ లోకము నా గమ్యము ఆ పరలోకము (2) నా గమ్యస్థానము నా యేసుని యందే యుగయుగములకు ప్రభుతో వసియింతును (2) ||శాశ్వతము కాదు|| స్థలమును సంసిద్ధము చేయుటకు వెళ్ళాడు నా కొరకే ప్రభు యేసుడు (2) నా తండ్రి గృహముకు నను చేర్చడానికి వస్తాడు వేగమే నను కొనిపోవుటకు (2) ||శాశ్వతము కాదు|| ఆవిరి వంటిది ఈ జీవితం ఏ క్షణమో తెలియదుగా నా అంతము (2) నా ప్రియుడు నా కొరకై రాబోయే దినమో ప్రేమతో తన ఇంటికి నను పిలిచే క్షణమో (2) ||శాశ్వతము కాదు|| నా ప్రభుని ఇంటిలో నాకు ఎప్పుడూ సంతోషమే సమాధానమే (2) ఈ లోక యాత్ర ముగిసిన వేళ నా తండ్రి రొమ్మున నేనుందును (2) ||శాశ్వతము కాదు|| --Saswathamu kaadu ee lokamu--
Telugu