శరణం శరణం శరణం దేవా

Telugu Christian Song

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2) కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2) శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం|| పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2) నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం|| దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2) దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం|| నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2) సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2) ||శరణం|| సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2) కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2) ||శరణం|| రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2) వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2)
Telugu
1 views