శరణు శరణు యేసు దేవా

Telugu Christian Song

శరణు శరణు యేసు దేవా నన్నుఁ గరుణింపవే నిత్య జీవా పరమ దేవుని తనూ భవుఁడవై ధరణిలో నర రూపమైతివి నరులను రక్షింప ||శరణు|| 1. దైవోగ్రమునకుఁ బాత్రుఁడను విమల భావమునకే నసహ్యుఁడను గావరించిన పాప కర్ముఁడన్ కఠినుఁడన్ జానవలసిన యట్టి స్వామి ద్రోహు డ నయ్య ||శరణు|| 2. మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగఁ బాపముల్ వేడ్కను జేసితి ||శరణు|| 3. మోసంబులోఁ జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని సిలువ నేమాత్రమైన నే నాసతోఁ జూడని యన్యాయ పరుఁడను ||శరణు|| 4. నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలోఁ ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారఁగ సమ్మతము దొరక దో
Telugu