శృంగార ద్వారంబు మా యేసు

Telugu Christian Song

శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార ద్వారము ||శృంగార|| 1. పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ పెట్టు ||శృంగార|| 2. యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ పెట్టు ||శృంగార|| 3. అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను జేర్చు ||శృంగార|| 4. ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు ||శృంగార|| --Srungaara dwarambu maa yesu--
Telugu