స్తోత్రము చెల్లింతును నా దేవునికి

Telugu Christian Song

స్తోత్రము చెల్లింతును నా దేవునికి వందనము అర్పింతును నా రక్షకునికి (2) ఆయన నన్ను ప్రేమించెను ఆయన నన్ను రక్షించెను (2) హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే స్తుతి హల్లెలూయా హల్లెలూయా రక్షకునికే మహిమ (2) ||స్తోత్రము|| సిలువపై మరణించి నా పాపములు భరించెను (2) తన రక్తము చిందించి నన్ను పరిశుద్ధుని చేసెను (2) ||స్తోత్రము|| మూడవ దినమున లేచి మరణమును జయించెను (2) పునరుత్థానుడై నాకు జీవము దయచేసెను (2) ||స్తోత్రము|| స్వర్గమునకు ఆరోహణించి నా కొరకు స్థలము సిద్ధపరచెను (2) తిరిగి రానున్నాడు నన్ను చేర్చుకొనుటకు (2) ||స్తోత్రము|| --sthothramu chellinthumu naa devuniki--
Traditional
Telugu