స్తుతి గానమే పాడనా

Telugu Christian Song

స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము – నా హృదయములో స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన – పరిచర్యలకై కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము – నను చేర్చుటకై నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి|| --Sthuthi
Telugu