స్తుతికి పాత్రుడ యేసయ్యా

Telugu Christian Song

స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే – జీవ జలము నీవే నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2) ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట (2) ||నీవే|| --Sthuthiki paathrudaa yesayya--
Telugu
1 views