స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము

Telugu Christian Song

స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము చేరడమే నా ఆతృత అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి|| కనులకే కనపడలేని నా కంటి పాపవై కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) నాకే తెలియక నాలో నీవు నాదు ప్రాణ శ్వాసవై నడిపించావా దేవా ఇన్నాళ్లుగా ||స్తుతి|| అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2) రాతి గుండెను దిద్ది గుడిగా మార్చుకున్న దైవమా ముల్లును రెమ్మగా మార్చితివి ||స్తుతి|| --Sthuthi madhura geethamu velaadi sthothramu--
Telugu