స్తుతించుడు యెహోవాను సర్వ జనమా
ఆయన దయ నిత్యము ఉండును (2)
హల్లెలూయా హల్లెలూయా
ఆయన కృప యుగములకును (2)
ఆయన సృష్టించిన సర్వమును
ఆయనను స్తుతించును (2)
నక్షత్రములు సూర్యుడు చంద్రుడు
దేవుని మహిమను ప్రకటించును (2) ||స్తుతించుడు||
పర్వతములు లోయలు సముద్రములు
తమ స్వరముతో స్తుతింతురు (2)
పక్షులు జంతువులు చేపలు
తమ విధముగా కీర్తింతురు (2) ||స్తుతించుడు||
మానవులము దేవుని స్తుతింతము
ఆయన మహిమను వర్ణింతము (2)
సర్వాత్మతో ఆరాధింతము
కృతజ్ఞతతో వందనము చేయుదము (2) ||స్తుతించుడు||
--Sthuthinchudu yehovanu sarva janamaa--