స్తుతి ప్రశంస పాడుచు

Telugu Christian Song

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2) మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2) పాపలోక బంధమందు దాసత్వమందుండ (2) నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2) ||స్తుతి ప్రశంస|| పాప భారముచే నేను దుఃఖము పొందితి (2) నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2) ||స్తుతి ప్రశంస|| హృదయాంధకారముచే నేను దారి తొలగితి (2) ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2) ||స్తుతి ప్రశంస|| పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి (2) దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2) ||స్తుతి ప్రశంస|| --Sthuthi prasamsa paaduchu keerthinthu nithyamu--
Telugu