స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా

Telugu Christian Song

స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా.. ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభూ.. 1. నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ.. నా మనసు నీవైపు - త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ.. నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో --Sthuthi paathrudaa sthothraahudaa--
Telugu
1 views