స్తుతి సింహాసనాసీనుడా

Telugu Christian Song

స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి|| --Sthuthi simhaasanaaseenuda--
Telugu