స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం
ప్రభు యేసునే స్తుతించెదం పరిశుద్ధాత్మనే కీర్తించెదం
రారాజుకే స్తుతి పాడెదం త్రీయేక దేవుని కొనియాడెదం
మనలను ఎంతో ప్రేమించిన పరమ తండ్రిని స్తుతియించెదం
మనకై ధరణిలో ఉదయించిన క్రీస్తేసునాధుని కీర్తించెదం
సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్మను కొనియాడెదం
మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతియించెదం
మన దోషములకై మరణించిన ప్రియ కుమారుని కీర్తించెదం
మనకై విజ్ఞాపణ చేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం
--Sthuthinchedam keerthinchedam sthuthi paadedam koniyaadedam--