స్తుతియింతుము - స్తోత్రింతుము

Telugu Christian Song

స్తుతియింతుము - స్తోత్రింతుము పావనుడగు మా - పరమ తండ్రి 1. నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవా వర్ణింప మా తరమా - మహిమ గలిగిన నీ నామమును 2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి మాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా 3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని ప్రియమగు కాపరులన్ - ప్రియమారా మా కొసగిన తండ్రి 4. పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలుగా పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా 5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును పరిపూర్ణంబుగ సలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి 6. ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములో ప్రతియాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి 7. ఎల్లరిలో జీవజలం - కొల
Telugu