త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు
నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||
1. గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో
నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప
రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||
2. నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని
దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని
పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||
3. నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము
త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున
బడిపోతి నయ్యో దారి చెడి నే