తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చువరకు ఎత్తుకుని ముద్దాడును
చంకబెట్టుకొని కాపాడును యేసయ్యా
1. తల్లియైన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనియ్యను నేను నిన్ను కాపాడువాడు
కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్య
2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్ని
వీడిపోదు నా కృప నిన్ను నా నిబంధన తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్య
--Thallila lalinchunu thandrila preminchunu--