తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే
యను శక్తి నీయుమీ ||తనువు||
1. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త
వినయ పాదము లివిగో ||తనువు||
2. స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి
పూర్ణముగ నింపు ||తనువు||
3. వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ
జ్ఞానం బిదిగో ||తనువు||
4. నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట