ఉదయ కాంతి రేఖలో

Telugu Christian Song

ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల పాపాలు మోయు గొర్రె పిల్ల 1. పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని |ఉదయ.. 2. ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట |ఉదయ.. --Udaya kaanthi rekhalo--
Telugu
1 views