ఉదయించెను నాకోసం-సదయుడైన నిజదైవం /2/
పులకించెను నాహృదయం-
తలపోయగ యేసుని జన్మం
అ.ప: సంతోషం పొంగింది-
సంతోషం పొంగింది-సంతోషం పొంగి పొర్లింది
1. కలుషమెల్లను బాపను-సిలువప్రేమను చూపను /2/
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
2. భీతిని తొలగించను-నీతిని స్థాపించను /2/
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
3. దోష శిక్షను మోయను-త్రోవ సిద్థము చేయను /2/
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
--Udayinchenu naa kosam--