వాగ్దానములనన్ని నెరవేర్చుచున్నాడు

Telugu Christian Song

వాగ్దానములనన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు పల్లవి: నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమెగా చరణం 1: కన్నీటిని తుడుచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు నా నీతి వలన కానే కాదయా అంతా నీ నీతి వలనేనయ్యా చరణం 2: కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదిగా అది ఇరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా అనుబంధం: అది ఇరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా --Vagdhanamulanni neraverchu chunnadu--
Telugu