వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం – అవధులులేని ఆనందం మనకై తెచ్చింది
సంతోషం ఉత్సాహం రానేవచ్చింది – యేసు మనలను కాచుటకై క్రిస్మస్ వచ్చింది
జాలిగానే ఆడిపాడి – బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము – క్రిస్మస్ పండుగ చేసెదము /వచ్చింది/
1.చల్లటిమంచు కురిసే – యేసు రాజు నిదురించె
ఆడి పాడి బుజ్జగించ అక్కడికెళదాం రండి
లోకానికి ఇదియే సంబరమైన నాడు
దావీదు పురముకే ధన్యత కలిగెను చూడు
దీనులమైన మనకే – దర్శనమిచ్చెను ఈనాడు /జాలీ/
2.అందంగా పుట్టెను నేడు – ఆ బాల యేసుని చూడు
దీవెన పొందగ నేడే నీవు పరుగిడి చెంతకు రావా /2/
వరములు ఇచ్చే వరుడు కొలువు తీరినాడు
పాపులమైన మనకు రక్షణ కలిగిస్తాడు
ఎనలేని ఆనందం మదిలో నిలిపె