వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు
భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు
నీవైపు ||వేచి||
1. కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో
గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్
స్తుతియింప ||వేచి||
2. నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్
ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్
నమ్మబల్కిన మీకై ||వేచి||
3. వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్
కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు
టెప్పుడొ యంచు ||వేచి||
4. నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల
ద్వారమున నిశ్చింతపోవుచు