వెళ్ళెదము కూడి వెళ్ళెదము

Telugu Christian Song

వెళ్ళెదము కూడి వెళ్ళెదము శ్రేష్ఠ దేశమును చేరుటకు - నీతి నివసించును అందున 1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె ప్రవేశించ వలె విశ్రాంతిలో - తప్పిపోదుము మరచినచో 2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలో పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము 3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము 4. సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్ 5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము --Velledamu koodi velle
Telugu