వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు (2)
నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత క్రుపనిచ్చేదవు. . . . ||వేల్పులలో||
1.సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2) ||వేల్పులలో||
2.ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2)
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2) ||వేల్పులలో||
3.పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభి