వెలసెనులే గగనాన తూర్పుతార

Telugu Christian Song

వెలసెనులే గగనాన తూర్పుతార – నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార – రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే – ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే – దీనులు ధన్యులాయెనే “శుభవార్త దూతదెల్పగ – ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే – పరలోకానా సంగీతమాయెనే ” తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు – తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి – నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని జగాలనేలే జయశీలుడేసే – జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే – పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి – కీర్తించి కొనియాడెదము మా పాపభారం భరియించెనే – మా ధుఃఖ్ఖ దోషం తొలగి
Telugu