వేటగాని ఉరిలో నుండి

Telugu Christian Song

వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా|| --Vetagaani orilo nundi--
Telugu
13 views