వేయి నోళ్లతో స్తుతియించినా

Telugu Christian Song

వేయి నోళ్లతో స్తుతియించినా నీ ఋణమును నే తీర్చగలనా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించి నా వ్యసనములను వహియించి నా దోషములను క్షమియించి స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| శోధనలో నాకు జయమిచ్చి బాధలలో నను ఓదార్చి బలహీనతలో బలమిచ్చి నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా|| --Veyi nollatho sthuthiyinchinaa--
Telugu