విడిపిస్తాడు నా యేసుడు

Telugu Christian Song

విడిపిస్తాడు నా యేసుడు మరణపు లోయైనా నను విడువడూ (2) మనసు ఓడిపోయిననూ మనువు వాడిపోయిననూ (2) నను ఎత్తుకొనీ… నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక ||విడిపిస్తాడు|| ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2) తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2) తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2) తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడూ|| --Vidipisthadu naa yes
Telugu