విలువేలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు,
నీ జీవితాన్నే దారబోసితివే
Chorus:
నీది శాశ్వత ప్రేమయ – నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన – మారదు.. – ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును – నా దేవునికి సమస్తము – సాధ్యమే….
పాపములో పడిన నన్ను – శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే –
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ – నా కన్నీటిని తుడిచితివే
Chorus:
నీది శాశ్వత ప్రేమయ – నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన – మారదు.. – ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును – నా దేవునికి సమస్తము – సాధ్యమే….
పగలంతా మేఘస్తంభమై, – రాత్రంతా అగ్నిస్తంభమ