వింతగల మా యేసు ప్రేమను

Telugu Christian Song

వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె నహహా ||వింత|| 1. ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె నహహా ||వింత|| 2. పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె నహహా ||వింత|| 3. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె నహహా ||వింత|| --vinthagala maa yesu premanu--
Telugu