విసుగకుండా నిత్యము

Telugu Christian Song

విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము 1. ఏకీభవించి భువిపైన యిద్దరు - వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రివలన దొరుకునని - నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా 2. ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము 3. పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును 4. నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా 5. ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో అందరి మధ్యనుండే ప్రభువా
Telugu
1 views