వందనాలు వందనాలు
వరాలు పంచే - నీ గుణ సంపన్నతకు (2)
నీ త్యాగ శీలతకు నీ వశమైతినే
అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వంద||
1. ఇహలోక ధననిధులన్ని శాస్వతముకావని ఎరిగితిని (2)
ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే
ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి (2) ||వంద||
2. యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా (2)
యాజక వస్త్రములతో ననుఅలంకరించి
నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే (2) ||వంద||
3. ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము (2)
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి (2) ||వంద||
--Vandanaalu vandanaalu varaalu panche--