వందనం బొనర్తుమో ప్రభో ప్రభో (2X)
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
1. ఇన్నినాళ్ళు ధరని మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు
గాచియు - నెన్నలేని దీవెన లిడు నన్న యేసువా - యెన్నిరెట్లు స్తోత్రము లివిగో
...వందనం...
2. పాత వత్సరంపు బాపమంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునకు నీదు నీతి నొసగుమా - దాతా క్రీస్తు నాధ రక్షకా
...వందనం...
3. దేవ మాదు కాలుచేతులెల్లను - సేవకాళి తనువు దినములన్నియు నీవొసంగు
వెండి పసిడి - జ్ఞాన మంతయు నీ సేవకై యంగీకరించుమా
...వందనం...
4. కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు తీర్చుము
పాతకంబులెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీత