వర్ధిల్లెదము - మన దేవుని మందిరమందు

Telugu Christian Song

వర్ధిల్లెదము - మన దేవుని మందిరమందు నాటబడినవారమై నీతిమంతులమై - మొవ్వ వేయుదుము యేసు రక్తములోనే - జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే - జయము మనకు జయమే 1. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతి మేలును ||వర్ధిల్లెదము || 2. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను ||వర్ధిల్లెదము || 3. పరిశుద్ధాత్ముని అభిషేకములో - ఎంతో ఆదరణ కలదు ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును ||వర్ధిల్లెదము || --Vardhilledamu mana devuni mandiramandu--
Hosanna ministries
Telugu
1 views