వర్ణించలేను వివరించలేను

Telugu Christian Song

వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| --Varninchalenu vivarinchalenu--
Telugu