యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన

Telugu Christian Song

యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు|| 1. నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ|| 2. తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ|| 3. మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ|| 4. నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ|| 5. నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్
Telugu