యవ్వన క్రైస్తవ జనమా

Telugu Christian Song

యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా యేసుని పిలుపు వినుమా ఆయన వాక్కును గైకొనుమా 1. యొవనకాలమందే యేసు యొవన రుధిరం చిందించె సిల్వకెక్కి ప్రాణమిచ్చె ఆ ప్రేమను రుచి చూచినావా 2. యొవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము వాక్యముతో సరిచూసుకో నీ నడతను సరిదిద్దుకో 3. యొవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు జీవితం ప్రభుకీయుమా దీవన లెన్నో పొందుమా --Yavvana kraisthava janama kreesthuni--
Telugu