యెహోవా మహోన్నతుడా - మహిమయు

Telugu Christian Song

యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే ఇహమందు రక్షకా - మహిమంచి దాతవు 1. పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికి చాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకును రాజుల రాజు ప్రభువుల ప్రభువు - ధరపర లోకములకు దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ 2. పరమును విడచితివి - ధర కేతెంచితివి ప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివి తిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివి విరివగు నీ ప్రేమ - నరులపై చూపితివి ధర నీదే ఘనతయని - చరణముల పాడుదుము 3. సంఘమందు మహిమ నీకే - సకల యుగములకును యుగమందు ప్రతిజీవి - యెహోవాయని యనున్ జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవు ఆది యంతమై నీవు - అలరారుచున్నావు యుగయుగములకు - ఘనమహిమ కలుగును --Yehovaa mahonnath
Telugu