యెహోవా నా కాపరి యేసయ్య

Telugu Christian Song

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు – (2) లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా|| పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును (2) శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2) ||లోయలలో|| గాఢాంధకారపు లోయలలో సంచరించినను (2) అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2) ||లోయలలో|| తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో (2) త్రోవ చూపి నడిపించును సేదదీర్చును (2) ||లోయలలో|| చిరకాలము నేను యెహోవా సన్నిధిలో (2) నివాసమొందెదను నేను నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో|| --Yehova naa kaapari yesayya--
Telugu