యెహోవా నాకు వెలుగాయె

Telugu Christian Song

యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే (2) తన ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము (2) ||యెహోవా|| నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే (2) నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను (2) ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా|| --Yehova naaku velugaaye--
Telugu