యెహోవా నను కరుణించుమా

Telugu Christian Song

యెహోవా నను కరుణించుమా నా దేవా నను దర్శించుమా (2) ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా|| విచారము చేత నా కన్నులు గుంటలై వేదన చేత నా మనస్సు మూగదై (2) నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు|| అవమానము చేత నా గుండెలో గాయమై (నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2) నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు|| --Yehovaa nanu karuninchumaa--
Telugu