యెహోవా పరమ పురవాసి

Telugu Christian Song

యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి 1.ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి ||యెహోవా|| 2.యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు ||యెహోవా|| 3.పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును ||యెహోవా|| --Yehova parama puravaasi--
Telugu