యేసయ్యా నా హృదయాభిలాష

Telugu Christian Song

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా - 2 1. పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు - 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా "యేసయ్యా" 2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా - 2 విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా - 2 "యేసయ్యా" --Yesayyaa naa hrudayaabhilaasha--
Telugu