యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా (2)
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)
సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా (2)
ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక