యేసయ్యా నాప్రియా

Telugu Christian Song

యేసయ్యా నాప్రియా ! ఎపుడో నీ రాకడ సమయం 1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2 దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా || 2. మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2 మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా || 3. ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే || యేసయ్యా || --Yesayya naa priya--
Telugu