యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి

Telugu Christian Song

యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా (2) 1. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా (2) నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప ఎన్నడు (2) || యేసయ్యా || 2. నీ నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా (2) ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును (2) || యేసయ్యా || 3. గువ్వవలె నే నెరిగి నిను చేరనా నీ కౌగిటనే నొదిగి హర్షించనా (2) ఈ కోరిక నాలో తీరునా ? రాకడలోనే తీరును (2) || యేసయ్యా || --Yesayya nee krupa nanu amarathwaniki--
Hosanna ministries
Telugu
1 views