యేసయ్యా నిన్ను ప్రేమించువారు

Telugu Christian Song

యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2) శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి (2) నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2) సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిని ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2) మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారి చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2) వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును (2)
Telugu