యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా

Telugu Christian Song

యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు నిను వీడి జీవింప నా తరమా నిను ఆరాధింప నా బలమా ! మది మందిరాన కొలువైన నా వరమా !! 1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము దైర్యమునిచ్చే - నీ వాక్యములో నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !! 2. నా గురి గమ్యమైన నిను చేరిటకు ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు పొందబోవు -బహుమానమునకై నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను !! యేసయ్య !! 3. నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు మహనీయమైన - నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనము
Telugu