యేసు అందరికి ప్రభువు

Telugu Christian Song

యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే "యేసు" 1. అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే "యేసు" 2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె "యేసు" 3. పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి "యేసు" 4. రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె --Yesu andariki prabhuvu--
Telugu