యేసు దేవా నీదు రాక

Telugu Christian Song

యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ రోత బ్రతుకే పశువుల పాక – మారెను ప్రార్ధన ధూపవేదిక యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ 1. రక్షకుని ఇల మందిరము – కన్య మరియ దీన దేహము మంటి ఘటము నాశరీరము /2/ ఆత్మ దేవుని ఆలయము /2/యేసు/ 2. సర్వజనులకు మహానందము సర్వకాలము – సమాధానము పర్వదినము యేసు జననము /2/ దేవదూతల స్తోత్ర గానము /2/యేసు/ 3. పరమపురికి మార్గమాతడు మరణమైన మరియ సుతుడు /2/ మృతిని గెల్చిన మహిమరేడు /2/ మరల వచ్చును ఎదురు చూడు /2/యేసు/ --Yesu devaa needu raaka--
Telugu